హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీ పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవం!

​SRD: కంది మండల కేంద్రంలో శ్రీ పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు