హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ

NRML: నిర్మల్‌లోని బుధవార్ పేట్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. పట్టణానికి చెందిన చందుల శంకర్, ప్రదీప్ గురుస్వాములు తమ 18వ నారికేళ పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్యస్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. వివిధ రకాల పూలతో మండపాన్ని అందంగా అలంకరించారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.