హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలి'

NRML: నిర్మల్ పట్టణంలోని ఓ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధ్యక్షతన FLN జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. DEO మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన స్థాయులను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. FLN కాంపిటెంట్ పాఠశాలల్లో 2027 మార్చి నాటికి కనీసం 80 శాతం మంది విద్యార్థులు నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలను సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు.