హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వెటర్నరీ ఆస్పత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్ లైన్లలో కొత్త వైర్లు అమర్చే పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.