హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుగులోని జాతరకు రూ.15.33 లక్షల ఆదాయం

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతరకు రూ.15.33 లక్షల ఆదాయం వచ్చినట్లు జాతర ఈవో బిల్లా శ్రీనివాస్, ఛైర్మన్ గంగుల రమణారెడ్డి తెలిపారు. శనివారం హుండీ కానుకలను లెక్కించగా రూ.6.91 లక్షలు, టికెట్ల ద్వారా రూ.4.41 లక్షలు, టెండర్ల ద్వారా రూ.4.01 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం, వెండి కానుకలు లభించినట్లు పేర్కొన్నారు.