హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాద బాధితుడి మృతి

KNR: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన తాడూరి రాజు (39) గత నెల 8న ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 28న మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు.