హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 34 కేంద్రాల్లో నేడు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సెక్షన్ 163 అమలు చేస్తూ, కేంద్రాల పరిసరాల్లో ఇంటర్నెట్, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సునీల్ దత్ కోరారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.