హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీపీ మాధవికి క్రీడా పతకంపై సన్మానం

KNR: జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో రజత పతకం సాధించిన హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవిని హుజూరాబాద్ క్లబ్ సభ్యులు శనివారం రాత్రి ఏసీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. క్లబ్ ఉపాధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్‌రావు, కార్యదర్శి కటుకూరి మల్లారెడ్డి, కౌన్సిలర్ వర్దినేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కొత్త కమిటీ సభ్యులను ఏసీపీ అభినందించారు.