హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ వైద్యురాలి తొలగింపు

ADB: గర్భిణి మరణంపై విచారణలో నిర్లక్ష్యం తేలడంతో ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్టు వైద్యురాలు డాక్టర్ గుమ్ముల సాహిత్య సేవలను శనివారం రద్దు చేశారు. ఉట్నూరు మండలానికి చెందిన బొరకని సునీత (25) కవలలతో 32 వారాల గర్భిణిగా అక్టోబరు 21న చేరి, 24న శ్వాస ఇబ్బందితో మరణించారు. నలుగురు సభ్యుల కమిటీ విచారణలో పర్యవేక్షణ లోపాలు, చికిత్స ఆలస్యం బయటపడ్డాయి.