ఆసిఫాబాద్ జిల్లాలో డిసెంబర్ 7, 8 తేదీల్లో జోనల్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు జాదవ్ అంబాజీ తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన వారు భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు.
తెలంగాణ
జోనల్ స్థాయి పోటీల్లో వెయ్యి మంది క్రీడాకారులు


