హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో దీక్షా దివస్ ఏర్పాట్లు పూర్తి

HYD: కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభమైన నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకునేందుకు HYDలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రతి డివిజన్, బస్తీ, కాలనీలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరీంనగర్‌లో జరిగే భారీ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, నగరం నుంచి వేలాదిగా కార్యకర్తల తరలింపునకు వాహన సౌకర్యం కల్పించారు.