హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటోడ్రైవర్ మృతి

HNK: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన కాసగోని యాకయ్య (42) ఈ నెల 20న ఎలుకుర్తి క్రాస్ వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.