NLG: మిర్యాలగూడ శివారులోని రాంనగర్ బంధం సమీపంలోని డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త శుద్ధి చేయకపోవడంతో మంటలు చెలరేగి పొగ వ్యాపిస్తోంది. ఈదులగూడ, రాంనగర్ బంధం, గూడూరు, బాదలాపురం, మయూరినగర్ ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డు పొగతో ప్రజల ఉక్కిరిబిక్కిరి


