హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగం దొరకలేదని యువకుడి ఆత్మహత్య

WGL: ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుగ్గొండి మండలం రేబల్లెలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డాల హరినాథ్ (28) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ఉద్యోగం లభించక ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.