హైదరాబాద్: 28°C
తెలంగాణ

విత్తనాల డబ్బు కోసం రైతు ఆత్మహత్యాయత్నం

MLG: ఏటూరునాగారం మండలం శివాపురానికి చెందిన రైతు ముప్పు సురేష్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. USRH-26 M&F వరి విత్తనాలు సరఫరా చేసినందుకు రావాల్సిన రూ.3 లక్షలు సీడ్ మధ్యవర్తులు, ఆర్గనైజర్లు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. క్వింటాకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచిన డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.