హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడా

BHNG: మోత్కూరు మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న మోరీ స్లాబ్‌లపై వస్తువులు, ప్రకటన బోర్డులు, తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేయవద్దని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య వ్యాపారులను హెచ్చరించారు. శనివారం పరిశీలించి, నవంబర్ 30లోపు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. గడువు దాటితే ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామన్నారు.