ASF: తిర్యాణి మండలంలో పత్తి రైతులకు మిల్లుల వద్ద అదనపు వసూళ్ల భారం తప్పడం లేదు. పత్తి విక్రయాల నగదు చెల్లింపుల సమయంలో ప్రతి లక్ష రూపాయలకు రూ.1,500 చొప్పున 'క్యాష్ కమిషన్' పేరుతో కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రైతులకు మిల్లుల వద్ద అదనపు భారం


