NZB: నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో ఈ నెల 26న జరిగిన గోసం గంగాధర్ (45) హత్య కేసులో నిందితురాలైన భార్య సుమలతను శనివారం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై వినయ్ తెలిపారు. నగర్ దుబ్బకు చెందిన గంగాధర్ మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధించేవాడని, వేధింపులు భరించలేక సుమలత హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
భర్త హత్య కేసులో భార్య అరెస్ట్!


