NLG: నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే 2.20 టీఎంసీల నీరు తగ్గడంతో నీటిమట్టం 533.10 అడుగులకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం 174.26 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
సాగర్‌లో 174 టీఎంసీల నీటి నిల్వ


