హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో వైభవంగా శ్రీవారి వసంతోత్సవం

BHNG: స్వర్ణగిరిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చనతో పాటు అష్టలక్ష్మీ మంటపంలో కార్తీక దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. స్వామివారి సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 3 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.