హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు నీటి పొదుపు సాగు విధానాలను అనుసరించాలి'

PDPL: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రైతులు నీటి పొదుపు సాగు విధానాలను అనుసరించాలని ముత్తారం మండల వ్యవసాయ అధికారి అనూష సూచించారు. శనివారం మైదంబండలో సాగులో ఉన్న మిరప పంటలను పరిశీలించి, వరికి బదులుగా పప్పు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలను ఎంచుకోవాలని, బిందు సేద్యాన్ని వినియోగించాలని తెలిపారు.