హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైన్‌గంగ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణీ ప్రసవం

GDWL: కోర్బా- యశ్వంత్ పూర్ మధ్య నడిచే 12251 వైన్ గంగ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. అనంతరం గద్వాల రైల్వే స్టేషన్‌లో రైలు నిలిపి, తల్లి బిడ్డను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.