JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం దేవస్థానంలో అంతరాలయ దర్శనం, వాహన పూజలు, ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ధర్మదర్శనంతో పాటు రూ.100 ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.
తెలంగాణ
నేడు కొండగట్టు అంజన్న ఆలయంలో అర్జిత సేవలు బంద్


