హైదరాబాద్: 28°C
వార్తలు

ఓర్వకల్లు డ్రోన్ సిటీ శరవేగంగా అభివృద్ధి: లోకేష్

AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కేవలం 12 నెలల్లోనే ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ పరిశ్రమను రిలయన్స్ ఏర్పాటు చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. జాక్సన్, అగస్త్య గ్రీన్ ఎనర్జీ సంస్థలు కూడా పరిశ్రమలను ప్రారంభించాయని చెప్పారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీ వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. APలో రాయలసీమను ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామన్నారు.