హైదరాబాద్: 28°C
వార్తలు

భవిష్యత్ సవాళ్లకు సిద్ధం కావాలి: మంత్రి జూపల్లి

TG: వేగంగా మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. విద్య కేవలం మార్కులు, డిగ్రీలకే పరిమితం కాకూడదన్నారు. AI, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలని ఓ ప్రైవేటు కళాశాల కార్యక్రమంలో సూచించారు.