హైదరాబాద్: 28°C
వార్తలు

'10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగే లక్ష్యం'

TG: ఆయిల్‌పామ్‌ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం 3.37 లక్షల ఎకరాల్లో 92,504 మంది సాగు చేస్తున్నారన్నారు. 2023 DEC నుంచి ఇప్పటివరకు 1.54 లక్షల ఎకరాల్లో 46,840 మంది రైతులు కొత్తగా సాగు చేపట్టారని చెప్పారు. కొత్త తోటల ఏర్పాటు, నిర్వహణ కోసం 75,628 మంది రైతుల ఖాతాల్లో రూ.442.74 కోట్ల రాయితీ జమ చేశామన్నారు.