మహిళలకు 33% రిజర్వేషన్ల అమలే కేంద్రం లక్ష్యమని BJP సీనియర్ నేత GVL నరసింహరావు అన్నారు. లోక్సభ స్థానాలను 50 - 60 శాతానికి పెంచడంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లపై ప్రధాని మోదీ నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయని, అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు రాజకీయ కారణాలతో బిల్లులను వ్యతిరేకించడం దురదృష్టకమన్నారు.
వార్తలు
ప్రధాని నిర్ణయం అభినందనీయం: GVL


