హైదరాబాద్: 28°C
వార్తలు

‘రాహుల్‌ను వదిలేసి మహిళా బిల్లుకు మద్దతివ్వండి’

ప్రధాని కావాలనే ఆత్రుత, నిరాశతోనే రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాల్లో ఆయనకు 'సూపర్ పీహెచ్‌డీ' ఉందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులపై విమర్శలు కాంగ్రెస్, రాహుల్ మహిళా వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. చట్టసభల్లో మహిళల గళం పెంచేందుకు మోదీ కృషి చేస్తున్నారని, రాహుల్‌ను వదిలేసి బిల్లుకు విపక్షాలు మద్దతివ్వాలని ఆయన కోరారు.