హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: మణుగూరు మండలంలో రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని 11 కేవీ మణుగూరు ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీడీపీ సెంటర్, మణికంఠ నగర్, పూజారి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.