ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్‌కు నగదు పురస్కారం లభించింది. అవినీతి అధికారుల ఆట కట్టించడంలోనూ, ఏసీబీ సేవలను మారుమూల గ్రామాలకు చేరువ చేయడంలోనూ ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా శనివారం హైదరాబాద్‌లో ఏసీబీ డీజీ చారు సిన్హా చేతుల మీదుగా రమేశ్ ఈ క్యాష్ రివార్డును అందుకున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
సీబీ డీఎస్పీ రమేశ్‌కు నగదు పురస్కారం


