హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి'

KNR: నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ, టాస్క్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 17 కంపెనీలు పాల్గొనగా 294 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 99 మందికి స్పాట్ ఆఫర్ లెటర్లు అందజేశారు.