వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నవోదయ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 1068 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 900 మంది హాజరయ్యారు. 168 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగింది. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటలకే చేరుకున్నారు.
తెలంగాణ
నవోదయ పరీక్షకు 168 మంది గైర్హాజరు


