హైదరాబాద్: 28°C
తెలంగాణ

మతపరమైన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ ఖండన

MBNR: జడ్చర్లలో హిందూ పండుగలు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఖండించారు. కావేరమ్మపేటలో దసరా, దీపావళి, కార్తీక దీపాలపై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర మతాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.