హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల హక్కులు పరిరక్షించాలి: కలెక్టర్

MDK: జిల్లా కలెక్టరేట్‌లో శనివారం సురక్షిత బాల్యం అభియాన్ అవగాహన సదస్సు జరిగింది. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి, పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. వేధింపులు జరిగితే 1098కు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ పోస్టర్ ఆవిష్కరించారు. న్యాయమూర్తి రూబీనా ఫాతిమా, అధికారులు పాల్గొన్నారు.