హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'దీక్షా దివస్'ను విజయవంతం చేయాలి: మాజీ MLA

MHBD: తెలంగాణ సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన 'దీక్షా దివస్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. రేపు ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారు.