హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్ యజమానికి అధికారుల నోటీసులు

NRPT: మాగనూరు మండలం వడ్వాట్ గ్రామం శంకర్ లింగేశ్వర రైస్ మిల్ యజమాని దండే తమన్నాకు సివిల్ సప్లై అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.7,85,30,829 బకాయిని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. యజమాని అందుబాటులో లేకపోవడంతో మిల్లుకు నోటీసులు అతికించారు. లెక్కలపై సందేహాలుంటే కార్యాలయానికి వచ్చి సరిచూసుకోవాలని సూచించారు.