KNR: భూముల రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి భాగస్వామ్యంతో పారదర్శకంగా సర్వే చేపట్టాలని సూచించారు. HUZ డివిజన్లో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 11 గ్రామాల్లో కొనసాగుతోందని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
తెలంగాణ
భూముల రీ సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్


