హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్

NRPT: జిల్లా బీజేపీ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎల్లిగండ్ల గ్రామానికి చెందిన వడ్డే శ్రీరామ్ నియమితులయ్యారని జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు మాకం సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.