హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైకుంఠపురంలో భక్తుల రద్దీ

SRD: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురం ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. సంగారెడ్డి జిల్లాతో పాటు Hyd నుంచి భక్తులు భారీ సంఖ్యలో 14 అడుగుల విరాట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.