హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీలో వెల్దండ విద్యార్థిని ప్రతిభ

JN: తొర్రూరులో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన రాచకొండ సాధ్విత ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఎంఈఓ ఐలయ్య ఆధ్వర్యంలో సాధ్వితను శనివారం ఘనంగా సన్మానించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.