హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో పేరెంట్స్ మీటింగ్

SDPT: గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థినుల హాజరు, క్రమశిక్షణ, విద్యా ప్రగతిపై చర్చించి, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.