హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో నిలిచిన ధాన్యం టెండర్లు.. రైతుల ఇక్కట్లు

MBNR: జడ్చర్ల బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో లారీల యజమానులు, హమాలీల మధ్య నెలకొన్న విభేదాలతో ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. లారీల కిరాయిలు పెంచాలని యజమానులు సమ్మె చేయగా, రాత్రిపూట పనులపై అభ్యంతరంతో హమాలీలు విధులకు దూరంగా ఉంటున్నారు. టెండర్లు, లోడింగ్ ఆలస్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు.