హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ దుర్గ భవాని ఆలయంలో లక్ష దీపోత్సవం

KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో రేపు సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 70 వేల దీపాలతో తీర్చిదిద్దిన అమ్మవారి ముఖచిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.