GDWL: ధరూర్ మండలం అల్లాపాడు గ్రామంలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గోదాంల నిర్మాణంతో పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపడతాయని, రైతులు తక్కువ ధరకు పంటను వెంటనే విక్రయించాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.
తెలంగాణ
వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమిపూజ


