హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిలో పడి వ్యక్తి మృతి

MLG: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వెంకటాపురం మండలం మరికాల గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఉయిక గోవిందరావు (29) ఉదయం చేపల వేటకు వెళ్లి కాలు జారి నదిలో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.