RR: షాద్‌నగర్ గంజ్‌లోని శ్రీ గణేష్ దేవాలయానికి గాంధీనగర్ కాలనీకి చెందిన ఎస్.బాలేశ్వరి కుటుంబ సభ్యులు రూ.27,350 విలువైన 9.5 తులాల వెండి గుండ్లమాలను కానుకగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు తడిశెట్టి ప్రకాష్, శంకర్ లాల్ లహోటి సమక్షంలో అందజేయగా, పూజారి స్వామివారికి మాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న గణేశుడిని భక్తులు దర్శించుకున్నారు.
తెలంగాణ
గణేశుడికి కానుకగా 9.5 తులాల వెండి గుండ్లమాల


