హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

HYD: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి, జనవరి 11, 18 తేదీల్లో శ్రీకాకుళం నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో నల్గొండ, గుంటూరు, విజయవాడ, విజయనగరం సహా పలు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.