హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIEDO: మెడికల్ షాపులో నాగుపాము

MHBD :మహబూబాబాద్‌ పట్టణంలోని ఓ మెడికల్ షాపులో నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. శనివారం షాపులో పామును గమనించిన యజమానులు, అక్కడికి వచ్చిన వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. పాముకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని తెలిపారు.