హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నివీర్ వాయు నియామకాలపై అవగాహన కార్యక్రమం

GDWL: భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయుగా చేరి దేశసేవ చేయాలనుకునే యువతకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. అర్హులైన యువతకు నియామక ప్రక్రియపై డిసెంబర్ 6న గద్వాల ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.