NGKL: జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. సభ ప్రాంగణం, నాయకులు కార్యకర్తలకు అవసరమైన సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లపై BRS పార్టీ స్థానిక నాయకులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
తెలంగాణ
దీక్ష దివాస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే


